సిద్దిపేట కలెక్టర్‌గా హనుమంతరావు

సిద్దిపేట కలెక్టర్‌గా హనుమంతరావు కు బాధ్యతలు అప్పగించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ పదవికి వెంకట్రామ్ రెడ్డి రాజీనామా చేయడం తో ఆ స్థానంలో హనుమంతరావు బాధ్యతలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం హనుమంతరావు సంగారెడ్డి జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పుడు ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

వెంకట్రామ్ రెడ్డి విషయానికి వస్తే తెరాస పార్టీ ఫై ఉన్న అభిమానం తో ఆ పార్టీ లో చేరబోతున్నారు. ప్రస్తుతం ఈయనకు మ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈనెల 15న తన కలెక్టర్ పదవికి రాజీనామా చేశారు. బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. ఇటీవల కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఎవరైనా విత్తనాలు అమ్మితే.. ఆ పరిధిలోని అధికారులను విధుల్లో నుంచి తొలగిస్తానని కలెక్టర్ వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. దీనిపై విపక్షాలు పలు విమర్శలు చేశారు. గతంలో సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకటరామరెడ్డి సీఎం కేసీఆర్‌ పాదాలకు నమస్కారం చేయడం చర్చనీయాంశమైంది. కలెక్టర్​ అయి ముఖ్యమంత్రి కాళ్లపై పడటంపై విపక్షాలు, ప్రజలు మండిపడ్డారు.