అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్న భువనేశ్వరి, బ్రహ్మణి

అక్రమ కేసు నుంచి చంద్రబాబు బయటపడాలని ప్రార్థించిన వైనం

Bhuvaneswari, Brahmani who visited Annavaram Satyanarayana Swamy

అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని టిడిపి అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి దర్శించుకున్నారు. సత్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్రమ కేసు నుంచి చంద్రబాబు బయట పడాలని వారు దేవుడికి ప్రార్థించారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నిరసన దీక్షల్లో పాల్గొంటున్నవారికి భువనేశ్వరి, బ్రహ్మణిలు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. భువనేశ్వరి, బ్రహ్మణిలు అన్నవరంకు వచ్చిన నేపథ్యంలో అక్కడకు టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.