రేపు విజయవాడ లో సీఎం జగన్ పర్యటన

సీఎం జగన్ రేపు విజయవాడ , నెల్లూరు లలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు షెడ్యూల్ ఖరారు చేసారు. రేపు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ‘జయహో బీసీ’ సభ జరగనుండగా, ఉదయం 11.50 గంటలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు బయల్దేరతారు.

మధ్యాహ్నం 3.25 గంటలకు నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు. ఈ రిసెప్షన్ కార్యక్రమం స్థానిక వీపీఆర్ కన్వెన్షన్ లో జరగనుంది. రేపు సాయంత్రం 6.20 గంటలు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇక ‘జయహో బీసీ’ సభ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.. ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం ఉంటుంది. అలాగే మహాసభకు హాజరయ్యే నేతల కోసం నోరూరించే ఫుడ్ మెనూను రూపొందించారు. ఉదయం టిఫిన్‌లో ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, స్వీట్ రవ్వ కేసరి, కాఫీ, టీలు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనంలో వెజ్‌తో పాటూ నాన్ వెజ్ మెనూ ప్రిపేర్ చేశారు. నాన్ వెజ్ మెనూలో.. మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు కోడిగుడ్డు కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, వైట్ రైస్,పెరుగు, చక్కెర పొంగలి (స్వీట్) మెనూలో ఉంది.