పోలీసుల భద్రత మధ్య ఇంటికి వెళ్లిన పోసాని..

పోలీసుల భద్రత మధ్య ఇంటికి వెళ్లిన పోసాని..

పోసాని కృష్ణ మురళి మరోసారి పవన్ కళ్యాణ్ ఫై మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోసాని పవన్ కళ్యాణ్ ను ఇష్టంవచ్చినట్లు విమర్శలు చేసారు. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి పచ్చి బూతులు, అమ్మనా బూతులు తిడుతూ తనకు వేలాది మెసేజీలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే- అతని అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారో.. ఓ వైఎస్ జగన్ అభిమానిగా తాను కూడా అదే రకంగా స్పందించానని అన్నారు.

పవన్ కల్యాణ్ గారు మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని చెప్పారు. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని అన్నారు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి.. తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తానూ కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు. అక్కడి తో ఆగకుండా పవన్ కళ్యాణ్ ను వ్యక్తి గతంగా విమర్శలు చేసారు. రాసేవిధంగా కూడా లేకుండా పోసాని బూతులు మాట్లాడారు. ఈ మాటలకు పవన్ అభిమానులు , జనసేన కార్యకర్తలు మండిపడుతూ ప్రెస్ క్లబ్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఈ తరుణంలో పోలీసులు అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రికత్తత వాతావరణం నెలకొని ఉండడం తో పోలీసులు తమ వాహనంలో పోసాని ని తన ఇంటికి తీసుకెళ్లారు.