కొండపోచమ్మ జలాశయం నుండి నీరు విడుదల

సిఎం ఆదేశాల మేరకు నీరు విడుదల

kondapochamma-sagar-reservoir

సిద్దిపేట: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదలైంది. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఎమ్మెల్యే గొంగడి సునీత, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్‌సీ హరేరాం నీటిని విడుదల చేశారు. ఈ నీటి ద్వారా గజ్వెల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్, మర్కుక్ మండలాల్లోని 28 చెరువులను, ఆలేరు నియోజకవర్గంలోని ఎంతుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లోని 14 చెరువలకు నీటి విడుదలకానున్నాయి. కొండపోచమ్మసాగర్‌లో ప్రస్తుతం 5 టీఎమ్‌సీల నీరు నిలువ ఉండగా… మూడు మోటర్ల ద్వారా అధికారులు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ప్రధాన కాలువ నుంచి చెరువులు నింపే ప్రాంతాల్లో రైతులు సహకరించాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కోరారు. కాగా గత నెల 29న ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్‌ చేతుల మీదుగా కొండపోచమ్మ జలాశయానికి తరలిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి మర్కూర్‌ పంప్‌హౌజ్‌ ద్వారా కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. మంగళవారం కూడా మూడు మోటర్ల ద్వారా 1,250 క్యూసెక్కుల చొప్పున 3,750 క్యూసెక్కుల (0.3 టీఎంసీ) గోదావరిజలాలు పోచమ్మసాగర్‌లోకి ప్రవేశిస్తున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో మంగళవారం రాత్రి వరకు 4.2 టీఎంసీల జలాలు చేరాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/