కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే మృతి
చాలా దురదృష్టకరమన్న సిఎం మమతా బెనర్జీ

కోల్‌కతా:తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ ఇవాళ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. గత నెలలో ఆయన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. అయితే ఆయన మృతిపట్ల పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ. విచారం వ్యక్తం చేశారు. చాలా చాలా విషాదకరమైన విషయమని, ఫాల్తా నియోజకవర్గం నుంచి తమోనాష్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్‌గా పనిచేస్తున్నారని, తమది 35 ఏళ్ల అనుబంధం అని, ప్రజలు, పార్టీ కోసం ఆయన శ్రమించారని, సమాజ సేవకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని మమతా బెనర్జీ తెలిపారు. తమోనాష్ మృతి పట్ల భార్య జార్నా , కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు సంతాపం ప్రకటిస్తున్నట్లు మమతా ట్వీట్ చేశారు. ఇటీవల తమిళనాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే అనబళగన్ కూడా కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/