కేటీఆర్‌ కామెంట్స్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ పార్టీ నేతలు కూడా ఎక్కడ కూడా తగ్గిదేలే అన్నట్లు విమర్శలు , ప్రతి విమర్శలు , కౌంటర్లు వేస్తున్నారు. ఈ తరుణంలో టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ..కోమటిరెడ్డి బ్రదర్స్ ఫై చేసిన కామెంట్స్ ఫై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్ అయ్యారు. కాంట్రాక్టుల కోసమే అన్నదమ్ములు ఆటలాడుతున్నారంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణల్ని ఖండించారు వెంకట్‌రెడ్డి. కేటీఆర్ నీ భాష జాగ్రత్త.. నిజాయితీతో నిప్పులా బతికాను.. మీ కుటుంబంలా కమిషన్లతో కాదని విమర్శించారు. తమ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు.

అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని.. తన జోలికి వస్తే అవినీతి చిట్టా మొత్తం విప్పుతానంటూ హెచ్చరించారు. కోమటిరెడ్డి కాదు.. కోవర్టు బ్రదర్స్‌ అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోటీ రాజగోపాల్‌రెడ్డితో అయితే.. తననెందుకు లాగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కోవర్ట్‌ బద్రర్స్‌ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోవాలని డిమాండ్ చేశారు. తనలాంటి ఉద్యమకారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ సూచించారు.