ఢిల్లీలో BRS కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ సీఎం , BRS అధినేత కేసీఆర్..మంగళవారం ఢిల్లీ లోని BRS కార్యాలయాన్ని పరిశీలించారు. స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వస్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర ప్ర‌దేశ్ వెళ్లిన కేసీఆర్‌… ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఢిల్లీలో ఇటీవ‌లే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు.

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తరువాత మొదటిసారి ఢిల్లీ వచ్చిన కేసీఆర్.. అక్కడ బీఆర్ఎస్(BRS) కోసం తీసుకున్న కార్యాలయాన్ని సందర్శించారు. నగరంలోని సుభాష్ చంద్రబోస్ మార్గ్‌లో ఈ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆఫీసులో మరమ్మత్తులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. దీన్ని టీఆర్ఎస్ కొంతకాలం క్రితమే లీజుకు తీసుకుంది. ఇది రెండు ఫ్లోర్ల బిల్డింగ్. దీనికి సంబంధించి పెయింటింగ్ మరమ్మత్తులు కూడా పూర్తయ్యాయి. పార్టీ కార్యాలయంలోని అన్ని రూములు, ఛాంబర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై నేతలకు కేసీఆర్ సూచనలు చేసారు. మీడియా సమావేశాలతో పాటు పార్టీ నేతలతో సమావేశం కోసం ఏర్పాటు చేయాల్సిన మందిరాలు ఏ విధంగా ఉండాలనే దానిపై కేసీఆర్ వారికి కీలక సూచనలు చేయడం జరిగింది.