జనాలు లేక వెలవెలపోయిన పీకే సభ

ప్రశాంత్ కిషోర్ సభకు జనాలు లేక వెలవెలపోయింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ ప్రచారంలో భాగంగా (ఆదివారం) మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర చేపట్టినా సంగతి తెలిసిందే. పశ్చిమ చంపారన్ జిల్లా నుండి బిహార్‌లో 3,500 కిలోమీటర్ల మేరకుఈ ‘పాదయాత్ర’ సాగనుంది. యాత్ర దాదాపు 12-18 నెలల మధ్య ఉండే అవకాశం ఉంది.

అయితే యాత్ర చేపట్టిన తొలి రోజే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో నిర్వహించిన సభకు పట్టుమని పదిమంది కూడా హాజరు కాకపోవడంతో అది కాస్తా వెలవెలబోయింది. సభా ప్రాంగణం మొత్తం బోసిపోయి కనిపించింది. స్థానికులు కూడా పీకే సభపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఆయన వెంట నడిచిన కొద్దిమంది మాత్రమే కనిపించారు.

ఇక బీహార్ లో కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి తన పాదయాత్ర ఉపయోగపడుతుందన్నారు. అత్యంత పేద, వెనుకబడిన రాష్ట్రమన బీహార్ లో వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమాజంలో మెరుగై వ్యవస్థను సాధించడానికి పాదయాత్ర ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పర్యటిస్తానని ప్రశాంత్ కిషోర్ ట్వట్టర్ లో స్పష్టం చేశారు.