భారత్ కోరితే వస్తా : రఘురాం రాజన్ రాజన్

దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్‌ స్పందన

Raghuram Rajan

భారత్‌ పట్ల తనకున్న మమకారాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్ చాటుకున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి కరోనా ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

కోవిడ్‌-19పై వ్యూహాత్మక పోరులో తన అనుభవం అవసరమని కోరితే భారత్‌కు తిరిగి వస్తానని, సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

న్యూస్ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మహమ్మారి కోవిడ్‌-19 సవాళ్లను ఎదుర్కొనడంలో సాయం కోరితే అంగీకరిస్తారా అని ప్రశ్నించగా .. ఎస్‌ అని వెంటనే సమాధానమిచ్చారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/