ప్రతి పార్టీలో గ్రూప్‌లు ఉంటాయిః కోమటిరెడ్డి

రేవంత్, భట్టితో కలిసి పని చేస్తున్నట్లు చెప్పిన ఎంపీ

komatireddy-venkat-reddy-on-pcc-chief-post

హైదరాబాద్‌ః తనకు పీసీసీ చీఫ్ రానందుకు కొన్నిరోజులు బాధపడ్డానని కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం అన్నారు. కానీ తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కతో కలిసి తాను పని చేస్తున్నానని చెప్పారు. ప్రతి పార్టీలో గ్రూప్‌లు సహజమేనన్నారు. బీఆర్ఎస్ పార్టీలోను గ్రూప్‌లు ఉన్నాయని చెప్పారు.

ఉమ్మడి నల్గొండలో జగదీశ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కత్తులతో పొడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బిఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ గ్రూపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో అయినా గ్రూప్‌లు ఉంటాయన్నారు. తమ పార్టీలో నాయకులమందరం కలిసి పని చేస్తున్నామన్నారు.

45 రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుందని జోస్యం చెప్పారు. పార్టీలో ప్రతి పార్లమెంట్ పరిధిలో బలహీనవర్గాలకు టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. పదో తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు, పెన్షనర్లకు పింఛన్లు లేవని మండిపడ్డారు. వేతనాలు సక్రమంగా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమని నిప్పులు చెరిగారు.