కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం

etela rajender
etela rajender

హైదరాబాద్‌: కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేబినెట్ సబ్‌కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ శాఖాపరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 9 డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో పనిచేస్తాయని మంత్రి వెల్లడించారు. ప్రతీ డిపార్ట్‌మెంట్‌కి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని, కరోనా అనుమానం ఉన్న రోగులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలని కోరినట్లు చెప్పారు. ప్రజలకు విశ్వాసం కలిగించడం అందరి బాధ్యత అని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/