మునుగోడు ఉప ఎన్నిక బరిలో కోదండరామ్ పార్టీ

మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలుకావడంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు కు చేరారు. ఎవరికీ వారు తమ ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తూ..ప్రజలకు దగ్గర అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటె ఉప ఎన్నిక బరిలో టీజేఎస్ కూడా నిలవబోతుంది. మొన్నటి వరకు టీజేఎస్ అధినేత కోదండరామ్..కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇస్తారనే ప్రచారం బలంగా నడిచింది.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో ఉంది టీజేఎస్. దీంతో మునుగోడు ఉప ఎన్నికలో టీజేఎస్ మద్దతు కోరింది పీసీసీ. కోదండరామ్ తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. కోదండరామ్ మద్దతకు తమకే ఉంటుందని కాంగ్రెస్ భావించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసిన కోదండరామ్ కు మునుగోడు నియోజకవర్గం పరిధిలో మంచి మద్దతు లభించిందని ఆ పార్టీలు వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోదండరామ్ మద్దతు ఇస్తే తమకు బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. కాని ఇప్పుడు కాంగ్రెస్ కు షాకిస్తూ మునుగోడులో ఒంటరిగా పోటీ చేస్తామని కోదండరామ్ ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో టీజేఎస్ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. టీజేఎస్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలకి దింపే యోచనలో కోదండరామ్ ఉన్నట్లు తెలుస్తుంది.