బ్రిగేడియర్‌ లిద్దర్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళి

న్యూఢిల్లీ : హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని బ్రార్‌ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. బ్రిగేడియర్‌ లిద్దర్‌ భౌతికకాయం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు అర్పించారు. ఆయనతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, హర్యానా ముఖ్యమంత్రి మోహన్‌ లాల్‌ ఖట్టర్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌, ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి లిద్దర్‌కు నివాళులు అర్పించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/