‘వాల్తేర్ వీరయ్య’ నుండి పూనకాలు తెప్పించే అప్డేట్

వాల్తేర్ వీరయ్య నుండి పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పలు సాంగ్స్ శ్రోతలను , మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా..రేపు చిరంజీవి- రవితేజల ఫై తెరకెక్కిన సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసి అభిమానులను సంబరాల్లో నింపారు. పూనకాలు లోడింగ్‌ అంటూ సాగే ఈ పాటను రేపు రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. మరి ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.