కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించిన ఏపీ సీఎం జగన్

AP CM Jagan paid tribute to Krishna’s body

Community-verified icon


సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఏపీ సీఎం జగన్ నివాళ్లు అర్పించారు. ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ కు చేరుకున్న జగన్..ప‌ద్మాల‌యా స్టూడియోకి చేరుకొని నివాళ్లు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పలకరించారు. మహేష్ బాబు ను ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , గల్లా జయదేవ్ ను పలకరించారు.

ప్రస్తుతం ప‌ద్మాల‌యా స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచారు. ఉదయం నుండి తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు అభిమానులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది అభిమానులు చేరుకొన్నారు. ఓ గొప్ప నటులను కోల్పాయామని వారంతా బాధపడుతున్నారు. అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం కృష్ణ కు నివాళ్లు అర్పిస్తున్నారు.

కొద్దీ సేపటి క్రితం నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. అనంతరం మహేష్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల , త్రివిక్రమ్, మెహర్ రమేష్ తదితరులు నివాళ్లు అర్పించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత పూజా కార్య క్రమాలు జరిపి, అంతిమ యాత్ర మొదలుపెడతారు. 3 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు జరగనున్నాయి.