పవన్ కళ్యాణ్ ఫై నాని విమర్శలు

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు కురిపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 18 సీట్లు, జనసేనకి ఒక సీటు మాత్రమే వస్తుందని నాని జోస్యం తెలిపారు. మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కొడాలి నాని.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని అన్నారు. పవన్ కల్యాణ్ కు అసెంబ్లీకొచ్చి మైకు పట్టుకోవాలని ఆశగా ఉంది. కానీ, ఒంటరిగా వస్తే మైకు కదా అసెంబ్లీ గేటు కూడా పట్టుకోలేరు. అందుకే చంద్రబాబు సపోర్ట్ తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవటానికి జనసేన కార్యకర్తలు తన్నులు తిన్నా పర్వాలేదు.. జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. పవన్ ఎమ్మెల్యే అవటం కోసం, చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోసం కలిసి పోటీ చేయబోతున్నారు అని నాని విమర్శించారు.