చంద్రబాబుకు అస్వస్థత..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి జైల్లో రిమాండ్ గా ఉన్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. నగలు రోజులుగా ఎండతీవ్రత ఎక్కువగా ఉండడం తో జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, జైలులో గాలి లేకపోవడం కారణంగా చంద్రబాబు ఉక్కపోతకు గురయ్యారు.

తాను డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు జైలు అధికారులకు, వైద్యాధికారులకు తెలియజేశారు. దాంతో వైద్యులు ఆయనకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాగా, జైలులో సౌకర్యాల విషయమై.. తన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారని, వారు చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, వైద్యాధికారులు మాత్రం సమస్య ఏమీ లేదని, అవసరైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు వాడీ వేడిగా కొనసాగాయి. 17ఎ సెక్షన్‌ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే కోర్టు ముందుంచారు. రఫేల్‌ కొనుగోళ్లపై యశ్వంత్‌ సిన్హా వేసిన పిటిషన్‌, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను వివరించారు. 17ఎను అవినీతిని నిరోధించేందుకు తీసుకొచ్చారన ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. శుక్రవారం మరోసారి వాదనలు విననుంది కోర్ట్.