మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు : కొడాలి నాని

అమరావతి: మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచారని టీడీపీ చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోసారి మండిపడ్డారు. ఆనాడు ఎన్టీఆర్ మద్య నిషేధం విధించారని.. దానికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు తన పాలనలో మద్యం అమ్మకాలను విపరీతంగా చేస్తున్నారని విమర్శించారు ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలను పెంచారని అన్నారు. మద్యం అమ్మకాలలో అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

జంగారెడ్డిగూడెం మరణాలపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలను రాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/