వైఎస్‌ఆర్‌సిపి మరో ఎమ్మెల్యేకి కరోనా

తనకు వైరస్ సోకినట్టు వెల్లడించిన ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

ysrcp-mla-bhumana

అమరావతి: ఏపిలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి కరోనా వైరస్ సంక్రమించింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అయితే, లక్షణాలు పెద్దగా లేవని, చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/