సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటన లో నష్టాల లెక్క ఇది…

కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ బీహార్, హర్యానాలో మొదలైన ఈ ఆందోళనలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారిన సంగతి తెలిసిందే.

కేంద్రం వైఖరిని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన నిమిషాల వ్యవధిలోనే హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు బోగీలకు నిప్పు పెట్టారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. వారి తెలిపిన ప్రకారం…

ప్లాట్‌ఫాం వెలుపల ఉన్న విశాఖపట్నం-సికింద్రాబాద్‌ రైల్లో 4500 బెడ్‌రోల్స్‌ కాలిపోయాయి. మరో రెండు రైళ్లలో కొన్ని అద్దాలు పగిలాయి. మరోదాంట్లో వెలుపలి పెయింట్‌ కాలింది.

కాలిన బోగీలు: 5. ఇందులో మూడు లగేజ్‌వి. రెండు ప్రయాణికులవి. అందులో జనరల్‌, స్లీపర్‌ ఒక్కోటి.ధ్వంసమైన ఏసీ బోగీలు: 30ధ్వంసం అయిన నాన్‌ ఏసీ బోగీలు: 47

ఒక ఎంఎంటీఎస్‌: పూర్తిగా ధ్వంసం

జరిగిన నష్టం ఎంతెంత? (రూ.లక్షల్లో)

ప్రయాణికుల రైలు బోగీల్లో కాలిని, ధ్వంసమైన వస్తువుల వివరాలు..

బెడ్‌షీట్లు (4300) 9,03,000
పిల్లో కవర్లు (2000) 64,000
స్మోక్‌ గ్లాస్‌లు (109) 4,00,575
విండో గ్లాస్‌లు (400) 5,01,600
మరుగుదొడ్డి గ్లాస్‌లు (84) 93,660
బెర్తులు (150) 7,50,000
ఎస్‌ఎల్‌ఆర్‌ లగేజ్‌ 15,00,000
జనరల్‌ సిట్టింగ్‌ బోగీ 30,00,000
ఎల్‌వీపీహెచ్‌ లగేజ్‌ 30,00,000
స్లీపర్‌ బోగీ 1,50,00,000
స్పార్ట్‌ వెలుపలి భాగం 3,000
టవళ్లు (2060) 89,680
ఇతరత్రా 50,00