9 గంటలు 200 కిలోమీటర్ల బైక్ ర్యాలీతో సరికొత్త రికార్డ్ సృష్టించిన కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి జి. కిషన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. స్వయంగా తానే 200 కిలోమీటర్లపాటు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 7 గంటలపాటు జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా కేంద్రమంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ర్యాలీ ప్రారంభమైంది.

ఈ ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు, యువత తమ వాహనాలతో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. అడుగడుగునా మహిళలు, కార్యకర్తలు.. కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. హరతి పట్టి వీరతిలకం దిద్దారు. త్రివర్ణ పతాకాలు, బీజేపీ జెండాలతో ఈ ర్యాలీ పొడగునా రోడ్లన్నీ రంగులమయంగా మారాయి. బైక్ యాత్ర హబ్సిగూడ, ఉప్పల్, ఘట్ కేసర్, భువనగిరి, ఆలేరు మీదుగా జనగాం, వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది.