రేపటి నుండే భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశం మొత్తం సిద్ధమైంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల ను పల్లె , పట్టణం , ఊరు, వాడ అనే సంబంధం లేకుండా ప్రతి చోట , ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా జరుపుకుంటుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరిపేందుకు ప్రజలు , భక్తులు సిద్ధమయ్యారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల అంటే అంత ఖైరతాబాద్ గణేశుడి ఫైనే దృష్టి సారిస్తారు. దేశం మొత్తం మీద ఖైరతాబాద్ గణేష్ కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రతి ఏడాది వేలాదిభక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటారు.

ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 63 అడుగుల ఎత్తులో రూపొందించారు. 2019లో 61 అడుగుల మేర రూపొందించగా.. ఈసారి అంతకు మించి రెండు అడుగులు ఎక్కువ ఎత్తులో రూపొందించారు. ఇక గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది విగ్రహం 13 అడుగుల ఎత్తు ఎక్కువ. 1954 నుంచి ఖైరతాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్.. ప్రతి ఏటా విగ్రహం ఎత్తును పెంచుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు 69 సంవత్సరాలుగా గణనాథుడిని ప్రతిష్టించి పూజిస్తున్నారు.

ఖైరతాబాద్ గణేషుడి పనుల్లో చివరి అంకం పూర్తి అయ్యింది. గణనాథుడికి కళ్లు దిద్దారు శిల్పి రాజేంద్రన్. శనివారం ఉదయానికి సపోర్ట్ కర్నలన్నింటినీ తొలగించారు. రేపు ఉదయం నుంచి భక్తులకు భారీ గణనాథుని చూసే అవకాశం కల్పించనున్నారు ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్. సెప్టెంబర్ 18న వినాయక చవితి రోజున ప్రతిష్ఠించి గణనాథుడిని ప్రతిష్టించి, సెప్టెంబర్ 28న లేదా అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు.