చిరంజీవి మూవీ లో అక్కినేని హీరో..

వాల్తేర్ వీరయ్య మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లో అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

కాళిదాసు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సుశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోలో హీరోగా సినిమాలు చేసిన ఈయన అందులో కొన్ని విజయం సాధించాయి. మరికొన్ని డిజాస్టర్ పాలయ్యాయి. దాంతో స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు లభిస్తే నటించాలనే నిర్ణయం తీసుకున్నాడు సుశాంత్. అలా అతను నటించిన తొలి చిత్రం అల వైకుంఠపురం లో.. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో వరుసపెట్టి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రావణాసుర మూవీ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగానే ఇప్పుడు చిరంజీవి మూవీ లో ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తుంది. రేపు సుశాంత్ పుట్టిన రోజు సందర్బంగా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.