కిషన్ రెడ్డికి అస్వస్థత..

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కిషన్ రెడ్డిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిషన్ రెడ్డికి డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. అయితే, గ్యాస్ ట్రబుల్‌తోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు వెల్లడించారు. కిషన్ రెడ్డి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కిషన్‌ రెడ్డి సన్నిహితులు తెలిపారు.

అంతకుముందు.. కిషన్ రెడ్డి మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను పురస్కరించకుని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ లో ప్రస్తావించిన పలు అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయగా.. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి గ్యాలరీని ప్రారంభించారు.