నగరంలో మళ్లీ భారీ వర్షం

పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

heavy rain
heavy rain

హైదరాబాద్‌: హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఈరోజు సాయంత్రం సుమారు గంటకు పైగా పాటు కుండపోతగా వర్షం కురిసింది. కూకట్ పల్లి, మోతీ నగర్ రాజీవ్ నగర్, ఎర్రగడ్డ,ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/