జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద మృతి

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద మృతి చెందడం సంచలనం రేపుతోంది. రీసెంట్ గా విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ఛీఫ్ గెస్టుగా హాజరైన సమయంలో శ్యామ్ వేదికపై వచ్చి ఎన్టీఆర్ తో ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. అయితే బాడీ గార్డులు పక్కకు నెట్టి వేయడంతో ఎన్టీఆర్ పిలిచి శ్యామ్‌తో ఫోటో దిగాడు. అప్పటి వరకు శ్యామ్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు..ఆ క్షణమ్ నుండి శ్యామ్ పేరు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామ్.. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్యామ్ ఉరి వేసుకొని మరణించారనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. దాంతో శ్యామ్ మరణం హత్య, ఆత్మహత్యనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వందలాది మంది శ్యామ్ మరణం వెనుక వాస్తవాలు బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. శ్యామ్ ఉరి వేసుకొంటే కాళ్లు నేలకు తాకి ఎలా ఉంటాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి? జేబులో గంజాయి ప్యాకెట్లు ఎందుకు ఉంటే.. ఆ మత్తులో ఉరి ఎలా వేసుకొంటాడు? హ్యాండ్ కట్ చేసుకొంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకొంటాడు? అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ప్రశ్నలు వేస్తున్నారు. ప్రస్తుతం శ్యామ్ మరణం ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.