హస్తినలో కిసాన్ ర్యాలీ ప్రారంభం

పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితి

Kisan Rally
Kisan Rally

New Delhi: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున మంగళవారం రైతుల కిసాన్ ర్యాలీ ప్రారంభమైంది. పోలీసులు అనుమతి ఇచ్చి కూడా పలు చోట్ల బ్యారికేడ్లు అడ్డంగా పెట్టడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

పశ్చిమ ఢిల్లీలో రైతు ర్యాలీ ప్రశాంతంగా సాగుతోంది.  నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని రైతు నేతలు విజ్ఞప్తి చేయడం, ఆపై రైతు ప్రతినిధులు, పోలీసులు సమావేశమై చర్చలు జరిపిన తరువాత, ర్యాలీ మార్గంలో ఉన్న అవరోధాలను పోలీసులు తొలగించారు.

రైతులు, మువ్వన్నెల  జెండాలతో అలంకరించిన  ట్రాక్టర్లతో పోలీసు బందోబస్తు మధ్య హస్తిన చుట్టూ ఉన్న రింగ్ రోడ్లపై కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ సాగుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/