లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నాడు – మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఏపీలో టీడీపీ – వైస్సార్సీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. సభ, సమావేశాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఇరు నేతలు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్..నారా లోకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నాడని ఎద్దేవా చేసారు.

కిన్నెర ప్రసాద్ కు నేను బినామీ అని లోకేష్ అంటున్నారని…అక్రమ లే ఔట్లులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వం స్పష్ఠమైన ఆదేశాలు ఇచ్చిందని… ఇది కూడా తెలియదా..? నన్ను కిన్నెర ప్రసాద్ కు బినామీ అని పప్పు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీలో ఉన్నపుడే కిన్నెర ప్రసాద్ నాలుగు లే అవుట్లు వేశారని…అవి కూడా అక్రమ లే ఔట్ లేనా..? అంటూ ప్రశ్నించారు. బినామీలు నారాయణా…? నువ్వా..? అంటూ లోకేష్ ను ప్రశ్నించారు. అప్పుడు వేసిన లే ఔట్ లు అన్నీ సక్రమమైన వని చెప్పే ధైర్యం ఉందా..? టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారి ఒప్పందంతో ఉన్నారని… నేను రుజువు చేస్తా అని సవాల్ చేశారు.