రైతుల కృషి ప్రశంసనీయం

జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం

President Ramnath Kovind
President Ramnath Kovind

New Delhi: దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత జాతికి సైనికులు, రైతులు అంది స్తున్న సేవలను కొనియాడారు. తన ప్రసంగంలో ప్రధానంగా ఆహారభద్రత,సరిహద్దు భద్రత అంశాల ను ప్రస్తావించారు. రైతులు, సైన్యం కష్టాలను గుర్తు చేశారు.

విదేశాలలోని మన సోదర,సోదరీమణులు మన జాతి సంతతి మనకు గర్వకారణం.

సరిహద్దుల్లో విస్తరణాత్మక సవాళ్లను దేశం ఎదుర్కొంటోందని, మన సైనికులు ధైర్యసాహసాలతో వాటిని తిప్పికొడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధం గా ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశంలో ఆహారభద్రత కు రైతులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రతి భారతీయుడు రైతులకు నమస్కరిస్తున్నాడని, విశాల భారతావనికి ఆహార ధాన్యాలు, పాల ఉత్పత్తులపై స్వావలంబన సాధించి పెట్టారని చెప్పారు.

ప్రకృతి ప్రతికూలతలు, కొవిడ్‌ మహమ్మారి వంటి ఇతర సవా ళ్లు ఉన్నప్పటికీ మన రైతులు వ్యవసాయ ఉత్పత్తిని కొనసాగించారని అన్నారు. అదేవిధంగా లడఖ్‌లోని సియాచిన్‌, గాల్వాన్‌ లోయలో ఎముకలు కొరికే చలి లోనూ సైనిక యోధులు అప్రమత్తంగా ఉంటూ సరి హద్దులను రక్షిస్తున్నారని చెప్పారు.

భారత్‌ తన సరిహ ద్దుల్లో విస్తరణవాద చర్యను ఎదుర్కొంటున్నది. కానీ, మన పరాక్రమ సైనికులు దానిని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన భద్రతను అణగదొక్కే ప్రయత్నాలను అడ్డు కునేందుకు సైన్యం, వైమానికదళం, నావికాదళం సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/