రంజాన్‌ నేపథ్యంలో దుబాయి రాజా కీలక నిర్ణయం

జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న 874 ఖైదీలను విడిచిపెట్టాలని నిర్ణయం

Sheikh Mohammed bin Rashid
Sheikh Mohammed bin Rashid

దుబాయి: దుబాయి రాజు యూఏఈ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ రంజాన్‌ మాసం సందర్భంగా అక్కడ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను విడిచిపెట్టాలని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ మేరకు 874 మంది ఖైదీలను విడిచిపెట్టాలని ఆదేశాలను జారీ చేశారు. ఇటీవల యూఏఈ లోని వివిధ జైళ్లలో ఉన్న 1,511 ఖైదీలను విడుదల చేయగా.. ఇప్పుడు మరోసారి ఖైదీలను విడిచిపెట్టనున్నారు. ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదించడం ద్వారా ఖైదీల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాగా యూఏఈ ప్రభుత్వం ప్రతి ఏడాది ఖైదీలను విడిచిపెడుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది. వస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/