బీరుట్‌ పేలుళ్లు ..100కు చేరిన మృతులు

beirut-explosion

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు ఘటనలో మృతుల సంఖ్య 100కు చేరింది. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లుకు పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఓడరేవు నుంచి ఇంకా పొగ వస్తూనే ఉన్నది. వీధులన్నీ శిథిలాలు, దెబ్బతిన్న వాహనాలతో నిండిపోయాయి. పరిసర ప్రాంతాల్లో భవనం పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. ఈ ప్రమాదంలో 100మందికి పైగా మరణించారని, సుమారు 4వేల మందికి పైగా గాయపడ్డారని లెబనీస్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. పేలుళ్లకు కారణమేమిటో ఇప్పటి వరకు తెలియలేదు. గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/