24 గంటలలో మౌళిక వసతులు కల్పించాలి

ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏపి హైకోర్టు

ap high court
ap high court

అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. వారి సొంత గ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేక, ఉన్నచోటే అర్ధాకలితో అలమటిస్తు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు కష్టాలు పడుతున్నారంటూ రాష్ట్ర సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ట దాఖలు చేసిన పిటీషన్‌ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర కేసులగా పరిగణించిన న్యాయస్థానం దీనిపై విచారణ జరిపి వలస కూలీలకు 24 గంటలలో మౌళిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఇప్పటికే అవస్థలు పడుతున్న వలస కూలీలు గుంటూరులో ఇద్దరు, గుజారాత్‌లో ఒకరు మరణించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/