రాళ్ల దాడి ఫై సింగర్ మంగ్లీ క్లారిటీ

ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందనే వార్త యావత్ చిత్ర సీమ మాట్లాడుకునేలా చేసింది. బళ్లారి నగరంలో బళ్లారి ఉత్సవ్ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్ల దాడి జరిగిందని , ఈ దాడి లో కార్ డ్యామేజ్ అయ్యిందని వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ ప్రచారం చూసి చాలామంది మంగ్లీకి ఫోన్ చేయడం, ఆరా తీయడం చేసారు. అయితే ఈ వార్తలపై మంగ్లీ స్పందించారు.

ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని..అవన్నీ పుకార్లే అని తేల్చి చెప్పింది మంగ్లీ. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బళ్లారిలో జరిగిన ఈవెంట్ పెద్ద సక్సెస్ అయిందని… కన్నడ అభిమానులు తనపై చూపించిన అభిమానం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కొందరు అభిమానులు తనతో సెల్ఫీలు కూడా దిగారని తెలిపింది. అధికారులు, నిర్వాహకులు కూడా తన పట్ల ఎంతో జాగ్రత్త తీసుకున్నారని , త్వరలోనే తాను కన్నడ భాషను నేర్చుకుంటానని చెప్పుకొచ్చింది. దాడి జరిగిన కారులో తాను లేనని స్పష్టం చేశారు.