సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం..ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది

Metro train Speed hike

హైదరాబాద్ మెట్రో సేవలు మరోసారి నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌లో మెట్రో ట్రైన్‌ను నిలిపివేయడంతో.. ఆ రూట్‌లోని మిగతా ట్రైన్లు కూడా ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు మరింతగా ఇబ్బందులు పడ్డారు. ఆలస్యం కాకుండా కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. ట్రైన్లు ఆగిపోవడంపై మెట్రో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రయాణికులందరినీ సిబ్బంది దింపేసి మరో ట్రైన్‌లో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోవడం తో అంత ఖంగారు పడ్డారు.

సాంకేతిక కారణాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం కలగడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఇలా టెక్నికల్ సమస్యల వల్ల ట్రైన్లు ఆగిపోయాయి. మెట్రో ట్రైన్లలో రోజూ వేలమంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. ఉదయం రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో అయితే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ మార్గంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల మెట్రో ట్రైన్లు నిలిచిపోవడంతో కొద్దిసేపు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.