రష్యాతో పోరుకు ఖైదీలను విడుదల చేస్తున్న ఉక్రెయిన్

సైనిక నేపథ్యం ఉన్న వారిని, నేరాల్లో అనుమానితులను విడుదల చేస్తున్న ఉక్రెయిన్

హైదరాబాద్ : దేశం కోసం యుద్దం చేయాలనుకునే అందరికీ ఆయుధాలను ఇస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు ఆ దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. వేలాది మంది ఆయుధాలను చేతపట్టి స్వచ్ఛందంగా యుద్ధ రంగంలోకి దిగారు. మరోవైపు ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తోంది. సైనిక నేపథ్యం ఉన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులుగా ఉన్న వారిని విడుదల చేస్తోంది. వీరంతా ఉక్రెయిన్ తరపున రష్యాపై యుద్ధం చేయనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ధ్రువీకరించింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/