‘కిడ్నీ స్టోన్స్‌’ బాధ పోవాలంటే..

ఆరోగ్య చిట్కాలు


శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌, ఉప్పు, కాల్షియంను కిడ్నీలు వడబోసి బయటకు పంపిస్తాయి. కాల్షియం, మినరల్స్‌, యూరిక్‌ఆసిడ్‌ వంటి వాటి కలయిక వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కిడ్నీలో రాళ్లు చిన్నసైజులో ఉంటే అవి మూత్రం ద్వారా బయటపడిపోతాయి.

kidney stones pain prevention
kidney stones pain prevention

అయితే పెద్ద సైజులో ఉండే రాళ్లు కిడ్నీలోనే ఉండి భరించలేని నొప్పిని కలగజేస్తాయి. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ‘ కిడ్నీ స్టోన్స్‌ నుంచి తప్పించుకోవాలంటే….

కిడ్నీ బీన్స్‌ :

వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పొడి కావాల్సిందే కిడ్నీ బీన్స్‌ను నానబెట్టి తరువాత ఉడికించుకుని ఇంగువ కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్‌ కిడ్నీ స్టోన్స్‌ను మూత్రం ద్వారా బయటకు విసర్జించేలా చేస్తుంది.

ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ :

ఇది కాల్షియం ఆక్సలేట్‌, ఇతర మినరల్స్‌ వల్ల ఏర్పడిన రాళ్లను ముక్కలు చేస్తుంది. భోజనానికి మందు ఒక టేబుల్‌స్పూన్‌ ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు ముక్కలు మారి మూత్రం ద్వారా బయటకు పోతాయి.

తులసి ఆకులు :

ఎండిన తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి, ఆ నీటిని తాగినా ఫలితం ఉంటుంది. రోజూ మూడుసార్లు ఈ నీరు తాగితే రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.

దానిమ్మరసం :

రోజూ దానిమ్మ, నిమ్మరసం తాగినా ఫలితం ఉంటుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/