ఆముదంతో అందాల కురులు !

అందమే ఆనందం

Castor oil is a great solution for hair problems
Castor oil is a great solution for hair problems

‘ఆముదం తాగిన ముఖం” అంటూ ఆముదాన్ని తేలిక చేసి మాట్లాడతాం! కానీ శిరోజాల సమస్యలకు ఆముదం చక్కని పరిష్కారం చూపుతుంది. జుట్టు రాలడం, చుండ్రు లాంటి ఇబ్బందులను ఆముదంతో తొలగించుకోవచ్చు.

జుట్టు రాలడం :

ఒత్తు పొడవులను బట్టి వెంటట్రుకలకు సరిపడేటంత ఆముదం తీసుకుని, రెండు నుంచి మూడు చెంచాల అల్లం రసం కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే వెంట్రుకలు రాలిపోయే సమస్య తగ్గుతుంది.

చుండ్రు :

సరిపడా ఆముదం, రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు, మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ తీసుకోవాలి. ఆముదంలో కలబంద గుజ్జు కలిపి, చివరగా టీ ట్రీ ఆయిల్‌ వేసి అన్నీ కలిసేలా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి 45 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు కనిపించదు.

కురులు ఒత్తుగా..

సరిపడా ఆముదం బాదం నూనెలను సమపాళ్ల లో తీసుకుని కల పాలి. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగిం చి, ఆ నీళ్లలో ఆముదం కలిపిన గిన్నెను ఉంచాలి. గిన్నె వేడిగా మారిన తర్వాత తీసి, మూడు చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ కలిపి కుదుళ్లకు, వెంట్రుకలకు పట్టించాలి. 40 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/