అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్..ఖమ్మం జిల్లా యువకుడు మృతి

ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు అమెరికా లో ప్రాణాలు విడిచాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి వెళ్లాడు. ఖమ్మం జిల్లా మధిర నగరానికి చెందిన మహంకాళి అఖిల్ సాయి ఉన్నత చదువుల కోసం ఏడాది కిందట అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. కాగా, ఖర్చుల కోసం ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా అక్కడి సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని పరిశీలిస్తుండగా, అది పొరపాటున పేలింది. అత్యంత సమీపం నుంచి తుపాకీ పేలడంతో బుల్లెట్ అఖిల్ సాయి తలను ఛిద్రం చేసింది. గ్యాస్ స్టేషన్ వారు అఖిల్ ను హాస్పటల్ కు తరలించగా, ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు. అఖిల్ సాయి మరణంతో మధిరలోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.