వాయిదా పడిన శాకుంతలం, ధమ్కీ చిత్రాలు

సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న సమంత శాకుంతలం , విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ చిత్రాలు వాయిదా పడ్డాయి. గుణశేఖర్ డైరెక్షన్లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం మూవీ ఈ నెల 17 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా అన్ని బాగుండడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ ప్రేక్షకులు , అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ షాక్ ఇచ్చారు.

ఫిబ్రవరి 17వ తేదీన శాకుంతలం మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ రోజున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేక పోతున్నామని చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తో వచ్చేస్తామని ప్రకటించింది మూవీ టీం. శాకుంతలం మూవీ వాయిదా పడటం ఇది రెండో సారి. గతేడాదే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు.

అలాగే ఈ మూవీ తో పాటు విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ మూవీ కూడా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా లో నటించడమే కాదు డైరెక్షన్ కూడా విశ్వక్ చేయడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఏమైందో ఏమో కానీ సినిమాను ఫిబ్రవరి 17 న రిలీజ్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటు డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేవని అందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.