ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర

మధ్యాహ్నం 3 గంటలలోగా మహాగణపతి నిమజ్జనం

ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
Khairatabad Maha Ganapati

హైదరాబాద్‌: నేడు హైదరాబాద్‌లో వినాయక ప్రతిమల నిమజ్జనం జరుగనున్నది. ఈనేపపథ్యంలోనే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలలోగా మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ తెలిపింది. నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. గత అర్థరాత్రి నుంచే నగరంలోకి అంతర్రాష్ట్ర, జిల్లాల లారీలకు అనుమతి నిలిపివేశారు. గణేశ్‌ ప్రతిమల నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా, కట్టుదిట్టమైన పోలీసు‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/