గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి

Khairatabad Ganesh’s Immersion in Hussain Sagar

హైదరాబాద్‌ః ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. కాసేపటి క్రితమే..ఖైర తాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది. అధికారుల సమక్షంలో ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు . హుసేన్‌ సాగర్‌ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్‌ నంబర్‌ 4 దగ్గర ఖైరతాబాద్‌ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ తరుణంలో… అక్కడ ఉన్న భక్తులు బైబై గణేష్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. అటు ఖైరతాబాద్‌ గణేషుని నిమజ్జనం చూసేందుకు ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చారు.

ముందుగా అధికారులు చెప్పినట్లుగానే మధ్యాహ్నం 2 గంటల లోపే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి చేశారని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయింది.