మరికాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు బయలు దేరారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్ర కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ప్రధానికి వివరించనున్న సీఎం జగన్‌.. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్‌, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్‌.. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దలకు వివరించనున్నారని తెలుస్తోంది.