భారత్ చంద్రయాన్ -3 పై స్పందించిన చైనా సైంటిస్ట్

చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకోలేదని ప్రకటన

Chandrayaan-3

బీజింగ్‌ః భారత్-చైనా మధ్య ఒకవైపు సరిహద్దు వివాదాలు నెలకొనగా. మరోవైపు చైనా శాస్త్రవేత్త ఒకరు అంతరిక్ష విజయాల్లో భారత్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ చైనా శాస్త్రవేత్త భారత్ చంద్రయాన్ ప్రయోగం ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రయాన్ -3 రోవర్ గత నెలలో చంద్రుడిపై అడుగు పెట్టి, ఎన్నో రకాల కీలక సమాచారాన్ని పంపిస్తుండడం తెలిసిందే. పైగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది అడుగు పెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ ఘనత సంపాదించుకుంది. చైనాకు కూడా ఇది సాధ్యం కాలేదు. దక్షిణ కొన వరకే అది చేరుకుంది.

భారత్-చైనా మధ్య ఒకవైపు సరిహద్దు వివాదాలు నెలకొనగా. మరోవైపు చైనా శాస్త్రవేత్త ఒకరు అంతరిక్ష విజయాల్లో భారత్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ చైనా శాస్త్రవేత్త భారత్ చంద్రయాన్ ప్రయోగం ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రయాన్ -3 రోవర్ గత నెలలో చంద్రుడిపై అడుగు పెట్టి, ఎన్నో రకాల కీలక సమాచారాన్ని పంపిస్తుండడం తెలిసిందే. పైగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది అడుగు పెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ ఘనత సంపాదించుకుంది. చైనాకు కూడా ఇది సాధ్యం కాలేదు. దక్షిణ కొన వరకే అది చేరుకుంది.