యువరాజ్‌సింగ్‌ సూటిప్రశ్న

వ్యక్తిత్వం ఆధారంగా వ్యవహరించాలని సూచన

Yuvraj Singh


భారత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథౌర్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించాడు..ఎవరైనా సరే తన వ్యక్తిత్వం ఆధారంగా ఒక ఆటగాడితో వ్యవహరించాలన్నారు..

భారత క్రికెటర్లన టి20 ఫార్మాట్‌లో మార్గనిర్దేశం చేయగల భారత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథౌర్‌ సామర్ధ్యాన్ని మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ ప్రశ్నించారు..

గత ఏడాది సంజయ్ బంగర్‌ స్థానంలో రాథౌర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితులైన సంగతి తెలిసిందే..

రాథౌర్‌ నా స్నేహితుడు.. నేటి టి20 తరం వాళ్లకు అతను సహాయం చేయగలడని మీరు అనుకుంటున్నారా?.. వారికి సహాయం చేయటానికి అతను స్థాయిలో క్రికెట్‌ ఆడారా ? అని ప్రశ్నించారు.

2007 ప్రపంచ టి20, 2011 ప్రపంచ కప్‌ విజేత జట్లలో భాగమైన యువరాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సెషన్‌లోనే చెప్పారు.. రాథౌర్‌ 1996, 1997 మధ్య భారత్‌కోసం ఆరుటెస్టులు , ఏడు వన్డేలు ఆడాడని అన్నారు. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వం ఆధారంగా వ్యవహరించాలని చెప్పారు..

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/