నాగశౌర్య కొత్త చిత్రంలో కథానాయికగా

కేతిక శర్మకు ఆఫర్లు

నాగశౌర్య కొత్త చిత్రంలో కథానాయికగా

పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉండే ప్రత్యేకత ల్లో హీరోయిన్లు కూడా ఉంటారు. ఆయన తన సినిమాల్లో కథానాయికల్ని చూపించే విధానమే వేరుగా ఉంటుంది.

ఇక కొత్త హీరోయిన్ అయితే చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికిందని అనుకుంటారు అందరూ. ప్రస్తుతం పూరి తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు.

ఇందులో కథానాయికగా కేతిఖా శర్మ అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు.

పోస్టర్లు, సాంగ్ టీజర్లతోనే కేతిక శర్మ తెలుగు యువతకు బాగా నచ్చేసింది. సోషల్ మీడియాలో అమ్మడి బోల్ద్ ట్రీట్ కు కుర్రకారు దాసోహం అంటోంది.

దీంతో ఆమెకు ‘రొమాంటిక్’ విడుదలకు ముందే కొత్త ఆఫర్లు వస్తున్నాయట.

తాజాగా నాగశౌర్య కొత్త చిత్రంలో కథానాయికగా కేతిక శర్మను అనుకుంటున్నట్టు టాక్ వినబడుతోంది.

ఇప్పుడే ఇలా ఉంటే ‘రొమాంటిక్’ విడుదలై మంచి విజయాన్ని సాధిస్తే ఈ హాట్ బ్యూటీ మరిన్ని ఆఫర్లు అందుకోవడం ఖాయం అంటున్నారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/