మంచు మనోజ్ మరోసారి ఆసక్తికర ట్వీట్స్

నిన్నంతా (ఆదివారం) మంచు అన్నదమ్ముల గొడవల గురించి మీడియా లో హైలైట్ అయ్యాయి. మొన్నటి వరకు కూడా ఎవరికీ కూడా వీరి మధ్య గొడవలు నడుస్తున్నాయని ఎవ్వరికి తెలియదు..కానీ నిన్న మనోజ్ పెట్టిన పోస్ట్ తో యావత్ సినీ ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మీడియా చానెల్స్ లలో కూడా హైలైట్ గా నడిచింది. ఈ క్రమంలో మోహన్ బాబు ఈ గొడవ ను చల్లార్చారు. మనోజ్ ఫై సీరియస్ కావడం తో తాను పోస్ట్ చేసిన ట్వీట్ ను తీసివేసాడు.

ఈరోజు మనోజ్ తన ట్విట్టర్ లో మరికొన్ని ఆసక్తికర పోస్టులు చేసాడు. ‘‘బతకండి.. బతకనివ్వండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా’’ అని ట్వీట్ పోస్ట్ చేసాడు. అలాగే కొటేషన్స్ ఉన్న మరో రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు. అమెరికన్ రచయిత సుజీ కాసెమ్ ‘‘అన్ని తప్పులను చూస్తూ పట్టించుకోకుండా జీవించడం కంటే.. సరైన దాని కోసం పోరాడుతూ చనిపోతాను’’ అని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘క్రియేటివిటీకి నెగిటివిటీనే పెద్ద శత్రువు’’ అంటూ అమెరికన్ ఫిల్మ్ మేకర్ డేవిడ్ లించ్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిన మరుసటి రోజే మనోజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.