జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా వార్ నడుస్తుంది. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..జేసీ ప్రభాకర్ రెడ్డి ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. నేను కనక ఎమ్మెల్యే కాకపోతే తాడిపత్రి పురవీధుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డిని పరిగెత్తించి కొడ్తా అంటూ పేర్కొన్నారు. నేను ఎమ్మెల్యే కావడం జగన్ పెట్టిన బిక్ష. నీకు దమ్ముంటే నా పొల్లల్లో కాళ్ళు పెట్టి చూడు.. కథ వేరే లా ఉంటది అంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్యేలకు పొలాలు ఉండకూడదా? ఇన్సూరెన్స్‌లు రాకూడదా అంటూ ప్రశ్నించారు. దొంగతనాలు చేసే కుటుంబం నీది. నాది నీతినిజాయితీ గల కుటుంబం. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని తిట్టినప్పుడు నీ మీద ప్రజలు సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు పెట్టారో గుర్తు చేసుకో. సీఐ‌లు, ఎస్ఐలను నోటికొచ్చినట్టు తిడతావ్. నువ్వు చచ్చిపోతే తాడిపత్రికి పట్టిన దరిద్రం పోతుంది అంటూ ఘాటుగా కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏడాదిన్నర చీనీ తోటకు పంట భీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ జేసీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పంటల భీమాలో రైతులకు న్యాయం జరగలేదని.. వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని…. దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు. చీనీ తోటలో పంట లేకుండానే… ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశారని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనీ చెట్లకు పంట నష్టం భీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వచ్చాయో.. వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు.