ద్రౌపది ముర్ము విజయం ఫై బండి సంజయ్ కామెంట్స్

,

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము భారీ విజయం సాధించడం పట్ల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం దేశ ప్రజల విజయమని , ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపితోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఆదివాసి మహిళను ఓడగొట్టేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. ఈ ఎన్నికలో తనకు ఓటేసే అవకాశం రావడం సంతోషకరమన్నారు. కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తానని మాట తప్పారని..రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోందని మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.

వేములవాడ ఎమ్మెల్యే ఏ దేశంలో ఉన్నాడో తెలియదని.. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేపై సీఎం కేసీఆర్ కు ఎందుకు అంత ప్రేమ అని ప్రశ్నించారు. రాజన్న గుడికి ఏటా 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక ఈరోజు నుండి బిజెపి తెలంగాణ లో ‘పల్లె గోస… బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు చెప్పటినుండి. సిద్దిపేటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వేములవాడలో నిర్వహించే బైక్‌ర్యాలీ లోనూ సంజయ్‌ పాల్గొన్నారు. తొలివిడతలో వేములవాడ, సిద్దిపేట, బోధన్‌, నర్సంపేట, జుక్కల్‌, తాండూరు నియోజకవర్గాల్లో బైక్ యాత్రలు ఉంటాయి. ఎల్లుండి నుంచి మరో 8 స్థానాల్లో బైక్‌ ర్యాలీలకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.