కొల్లం జిల్లాలో దారుణం : లోదుస్తులు తీసేస్తేనే నీట్‌ పరీక్ష హాల్‌లోకి అనుమతి

Kerala student forced to remove bra for NEET exam

కేరళలోని కొల్లం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నీట్ పరీక్షను రాయడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల మార్తోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. బాలికల లో దుస్తులను విప్పించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమీ లేక వారు చెప్పినట్లు విద్యార్థినులు లో దుస్తులను విప్పేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత తాము తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్ష అనంతరం లోదుస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోహపు వస్తువు దొరికడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని బాధ్యులు వివరణ ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది తీరుపై అంతా మండిపడుతున్నారు. డ్రెస్ కోడ్ ప్రకారం విద్యార్థులు ఎగ్జామ్ హాల్ లోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి లోహపు వస్తువులు లేదా ఉపకరణాలు ధరించడానికి అనుమతించబడరని వారు వెల్లడించారు.

ఇది యాంటీ చీటింగ్ చర్య అని వివరణ ఇచ్చారు. అయితే అండర్‌ వైరింగ్‌ని కలిగి ఉండే బ్రాలు వంటి లోదుస్తులకు ఈ రూల్ వర్తించదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, రూల్స్ పేరుతో సిబ్బంది ఓవరాక్షన్ చేశారని అంతా మండిపడుతున్నారు.